Apr 20,2023 21:27
  • ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అధికారికంగా వెల్లడి

మాడ్రిడ్‌: మాడ్రిడ్‌ మాస్టర్స్‌ టోర్నీకి స్థానిక ఆటగాడు, 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత రఫెల్‌ నాదల్‌ దూరమయ్యాడు. ఈ మేరకు నాదల్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌ వేదికగా మాడ్రిడ్‌ టోర్నీనుంచి వైదొలుగుతున్నట్లు అధికారికంగా వెల్లడించాడు. గాయం కారణంగా గత ఎనిమిది వారాలుగా కోలుకుంటున్నానని, ఇంకా గాయాల తీవ్రత తగ్గలేదని, ఈ కారణంగా స్థానిక టోర్నమెంట్‌నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ త్వరలో ప్రారంభం కానున్న దృష్ట్యా రికార్డుస్థాయిలో ఈ టైటిల్‌ను గెలిచిన నాదల్‌.. ఆ టోర్నమెంట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక నాదల్‌ తాజా ఏటిపి ర్యాంకింగ్స్‌లోనూ టాప్‌-10లో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈనెల 27నుంచి స్పెయిన్‌లోని మాడ్రిడ్‌ వేదికగా ఈ టోర్నమెంట్‌ ప్రారంభం కానుంది.