Jul 31,2022 15:35

ప్రజాశక్తి- నందిగామ :బళ్లారి రాఘవ కళా సమితి రాష్ట్ర అధ్యక్షులు నందిగామకు చెందిన బొబ్బలపాటి గోపాలకృష్ణ సాయికి ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్‌ సేవా పరిష్కార అవార్డును ఆదివారం తెనాలిలో అందజేశారు.బొబ్బిళ్ళపాటి సాయి ఎన్టీ రామారావు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తెనాలిలో శకపురుషుడు ఎన్టీఆర్‌ సంస్థ ఎన్టీఆర్‌ రంగస్థలం పురస్కారం ఇచ్చారు. ప్రఖ్యాత సినిమా రచయిత బుర్ర సాయి మాధవ్‌ , కళాకారులు స్థానిక ప్రజాప్రతినిధులు సాయిని సన్మానించారు.