Nov 17,2022 20:58

న్యూఢిల్లీ : ట్విట్టర్‌లో పని చేసే ఉద్యోగులకు ఆ సంస్థ బాస్‌ ఎలన్‌ మస్క్‌ కఠిన షరతులు పెడుతున్నారు. ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న వారం రోజుల్లోనే సగం మంది ఉద్యోగులను తీసేసిన మస్క్‌.. ఉన్న సిబ్బందిపై తీవ్ర పనిభారాన్ని పెంచుతున్నారు. చాలా తీవ్రంగా పనిచేస్తారా లేక నిష్క్రమిస్తారా తేల్చుకోవాలంటూ ఉద్యోగులకు ఈ మెయిల్‌ సమాచారం ఇచ్చారు. సంస్థ సంస్థాగత పుననిర్మాణంలో భాగంగా తీవ్ర ఒత్తిడితో, ఎక్కువ గంటలు పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లేదంటే వెళ్లిపోవడానికి అంగీకరించాలన్నారు. పని విషయంలో తాము పంపిన ఆన్‌లైన్‌ పత్రాన్ని గురువారం కల్లా పూర్తి చేసి పంపాలని.. లేదంటే మూడు నెలల ముందస్తు జీతం ఇచ్చి తొలగిస్తామని స్పష్టం చేశారు.