- ముంబయిపై ఏడు వికెట్ల తేడాతో గెలుపు
ముంబయి: వాంఖడే వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 157పరుగులు చేసింది. ఛేదనలో చెన్నై జట్టు 18.1 ఓవర్లలో కేవలం మూడు కోల్పోయి 159 పరుగులు చేసి గెలిచింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ముంబయికి ఓపెనర్లు రోహిత్(21), ఇషాన్(32) రాణించినా.. గ్రీన్(12), సూర్యకుమార్(1), ఆర్షాద్ ఖాన్(2), త్రిష్టన్ స్టబ్స్(5) నిరాశపరిచారు. టిమ్ డేవిడ్(31) ఫర్వాలేదనిపించినా భారీస్కోర్ సాధించలేకపోయాడు. జడేజాకు మూడు, సాంట్నర్, దేశ్‌పాండేకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో చెన్నై ఓపెనర్ కాన్వే(0) డకౌటయినా.. అజింక్యా రహానే(61; 27బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. గైక్వాడ్(40), శివమ్ దూబే(28) ఫర్వాలేదనిపించారు. దీంతో చెన్నై జట్టు సునాయాసంగా 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. బెహ్రెన్‌డార్ఫ్, పియూష్ చావ్లా, కార్తికేయకు ఒక్కో వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అజింక్యా రహానేకు లభించింది.
ముంబయి: రోహిత్ (బి) తుషార్ 21; ఇషాన్ (సి) ప్రిటోరియస్ (బి) జడేజా 32; గ్రీన్ (సి) అండ్ (బి) జడేజా 12; సూర్యకుమార్ (సి) ధోని (బి) శాంట్నర్ 1; తిలక్ ఎల్బీ (బి) జడేజా 22; అర్షద్ ఎల్బీ (బి) శాంట్నర్ 2; డేవిడ్ (సి) రహానె (బి) తుషార్ 31; స్టబ్స్ (సి) రుతురాజ్ (బి) మగలా 5; షోకీన్ నాటౌట్ 18; చావ్లా నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 157; వికెట్ల పతనం: 1-38, 2-64, 3-67, 4-73, 5-76, 6-102, 7-113, 8-131; బౌలింగ్: దీపక్ చాహర్ 1-0-10-0; తుషార్ దేశ్‌పాండే 3-0-31-2; మగలా 4-0-37-1; శాంట్నర్ 4-0-28-2; జడేజా 4-0-20-3; ప్రిటోరియస్ 4-0-28-0
చెన్నై: కాన్వే (బి) బెరెన్‌డార్ఫ్ 0; రుతురాజ్ నాటౌట్ 40; రహానె (సి) సూర్యకుమార్ (బి) చావ్లా 61; దూబె (బి) కార్తికేయ 28; రాయుడు నాటౌట్ 20; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (18.1 ఓవర్లలో 3 వికెట్లకు) 159; వికెట్ల పతనం: 1-0, 2-82, 3-125; బౌలింగ్: బెరెన్‌డార్ఫ్ 3-0-24-1; అర్షద్ ఖాన్ 2.1-0-35-0; కామెరూన్ గ్రీన్ 3-0-20-0, పియూష్ చావ్లా 4-0-33-1; కుమార్ కార్తికేయ 4-0-24-1; హృతిక్ షోకీన్ 2-0-19-0










