Feb 13,2023 15:13

ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించాడు. తన క్రికెట్‌ కెరీర్‌కు ఎంతో మద్దతుగా నిలిచిన భార్య, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు తెలియజేశాడు. మోర్గాన్‌ ఇంగ్లండ్‌ జట్టు తరపున 16 టెస్టులు, 248 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. ఐపీఎల్‌ లో 83 మ్యాచ్‌లు ఆడాడు. మోర్గాన్‌ నాయకత్వంలో ఇంగ్లండ్‌ 2019లో ప్రపంచ కప్‌ను గెలుచుకుంది, వన్డే మరియు ట్వంటీ 20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది.