ఇంటర్నెట్‌డెస్క్ : మహిళలు తరచూ హార్మోన్ల సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యలకు వైద్యులను సంప్రదించి మందులు వాడుకున్నా కొంతవరకే ఉపశమనం కలుగుతుంది. శరీరంలో హార్మోన్ల స్థాయి తగ్గితే ఎముకలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఈ సమస్యల నుంచి త్వరితగతిన ఉపశమనం పొందాలంటే.. హార్మోన్ల థెరపీ ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. హార్మోన్ థెరపీ ఎముక ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడుతుంది. మెనోపాజ్ సమస్య దాటిన 10 సంవత్సరాల తర్వాత అయినా ఈ చికిత్స మంచి ఫలితాలనిస్తుందని వైద్యులు చెబుతున్నారు. గర్భాశయం తొలగించిన మహిళల్లో హార్మోన్ల ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుంది. మరి ఈ థెరపీని ఎలాంటి అనారోగ్య సమస్యలున్నవారో తీసుకోకూడదో తెలుసుకుందామా..!
- రొమ్ము క్యాన్సర్‌తో బాధపడేవారు హార్మోన్ థెరపీని తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
- లివర్ సమస్యలతో బాధపడేవారు కూడా హార్మోన్ థెరపీ తీసుకోకూడదు.
- గర్భం దాల్చిన సమయంలోనూ ఈ థెరపీ తీసుకోకూడదు.
- ఈ థెరపీలో రక్తం గడ్డకట్టే అవకాశముంటుంది. అందువల్ల గుండెపోటుకి గురైన వారు ఈ థెరపీని తీసుకోకుండా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.