- ఫైనల్లో రుబ్లేవ్‌పై గెలుపు
దుబాయ్ : దుబాయ్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్‌గా రష్యాకు చెందిన డానియెల్ మెద్వదెవ్ నిలిచాడు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో మెద్వదెవ్ 6-2, 6-2తో ఆండీ రుబ్లేవ్‌పై వరుససెట్లలో గెలిచాడు. 3వ సీడ్‌గా బరిలోకి దిగి మెద్వదెవ్.. ఈ మ్యాచ్‌ను కేవలం 68 నిమిషాల్లోనే ముగించాడు. దీంతో 27ఏళ్ల మెద్వదెవ్ 6వ ర్యాంక్‌కు చేరుకోగా.. రుబ్లేవ్ 7వ ర్యాంక్‌లో నిలిచాడు. టోర్నీలో మూడేళ్లుగా నయా ఛాంపియన్స్ అవతరిస్తున్నారు. నార్వేకు చెందిన కాస్పర్ రూఢ్(2021), కెనడాకు చెందిన ఫిలిక్స్ అగర్(2022)లో ఇంతకుముందు ఈ టైటిల్ విజేతగా నిలిచారు.










