Feb 23,2023 12:05

హైదరాబాద్‌: ఐపీఎల్‌ జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొత్త కెప్టెన్‌ బాధ్యతలను దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ ఏడెన్‌ మార్‌క్రమ్‌ సన్‌రైజర్స్‌ అప్పగించింది. ఈ విషయాన్ని గురువారం ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. ఐపీఎల్‌ 2023 మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను వేలానికి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ ఎంపిక అనివార్యం కాగా.. రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్సీ రేసులో మయాంక్‌ అగర్వాల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌లు పోటీ పడగా.. యాజమాన్యం మార్క్రమ్‌ వైపు మొగ్గు చూపింది. కాగా సన్‌రైజర్స్‌ యాజమాన్యానికి చెందిన అనుబంధ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌ జట్టుకు కూడా మార్‌క్రమ్‌ సారథ్యం వహించాడు. ఇటీవల జరిగిన ఎస్‌ఏ20 (దక్షిణాఫ్రికా టీ20 ఫ్రాంఛైజీ క్రికెట్‌ టోర్నీ) టోర్నీలో మారక్రమ్‌ జట్టు విజేతగా నిలిచింది.

 

సన్‌రైజర్స్‌  జట్టు: ఎయిడెన్‌ మార్క్రమ్‌ (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, రాహుల్‌ త్రిపాఠి, సమర్థ్‌ వ్యాస్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌, హ్యారీ బ్రూక్‌, అబ్దుల్‌ సమద్‌, నితీశ్‌కుమార్‌ రెడ్డి, హెన్రిచ్‌ క్లాసెన్‌, ఉపేంద్ర యాదవ్‌, సన్వీర్‌ సింగ్‌, వివ్రాంత్‌ శర్మ, అభిషేక్‌ శర్మ, మార్కో జన్సెన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కార్తీక్‌ త్యాగీ, ఉమ్రాన్‌ మాలిక్‌, టి నటరాజన్‌, ఫజల్‌ హక్‌ ఫారూఖీ, భువనేశ్వర్‌కుమార్‌, ఆదిల్‌ రషీద్‌, అకీల్‌ హొసేన్‌, మయాంక్‌ డాగర్‌, మయాంక్‌ మార్కండే