Sep 20,2023 15:23

హైదరాబాద్‌: నాంపల్లి కోర్టు భవనంపై నుంచి దూకి మహ్మద్‌ సలీముద్దీన్‌ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. మెహదీపట్నం ఫస్ట్‌ ల్యాన్సర్‌ ప్రాంతానికి చెందిన డుసలీముద్దీన్‌ గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నాడు. నేడు(బుధవారం) కోర్టులో పేషీ ఉండటంతో నాంపల్లి కోర్టులో హాజరయ్యాడు. ఈ క్రమంలో కోర్టు భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన సలీముద్దీన్‌ను పోలీసులు ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఆత్మహత్య యత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.