Aug 31,2023 12:34

ప్రజాశక్తి-వత్సవాయి (ఎన్‌టిఆర్‌) : వత్సవాయి మండలం నందిగామ బ్రాంచ్‌ కెనాల్‌ చిల్లకల్లు - మక్కపేట కెనాల్‌, పెనుగంచిప్రోలు మేజర్‌ చిట్యాల మైనర్‌ గోపినేనిపాలేం కెనాల్‌ వద్ద పుడికతీత పనులు, జంగిల్‌ క్లీనింగ్‌ పనులను ప్రభుత్వవిప్‌, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. నందిగామ బ్రాంచ్‌ కెనాలపై సుమారు నాలుగు కిలోమీటర్లు మేర 5.50 లక్షల రూపాయలతో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు చేపట్టామన్నారు. ప్రాధాన్యత క్రమంలో అన్ని కాలువలను అభివృద్ధి చేస్తామని అన్నారు. మునేటి ఆయకట్టు కింద ఉన్న రైతులు ధైర్యంగా సాగు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు, ఎంపీపీ కొలుసు రమాదేవి, జడ్పిటిసి యేసుపోగు దేవమణి, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు, వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు చింతకుంట్ల వెంకటరెడ్డి, డిసి మాజీ ఉపాధ్యక్షులు గుంటుపల్లి వాసు, ఈ ఈ సంతోష్‌, డిఈ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.