Apr 22,2023 15:04

పవర్‌ ప్లే పూర్తయ్యే సమయానికి లక్నో సూపర్‌ జెయింట్స్‌ 53 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌, కైల్‌ మేయర్స్‌ దాటిగా ఆడుతూ.. స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. కేఎల్‌ రాహుల్‌ 11 బంతుల్లో 30 పరుగులు, కైలే మేయర్స్‌ 18 బంతుల్లో 23 పరుగులు చేశారు.

  • హ్యాట్రిక్‌ ఫోర్స్‌

షమీ వేసిన 3వ ఓవర్‌లో కేఎల్‌ రాహుల్‌ చివరి 3 బంతులను బౌండరీకి తరలించి హ్యాట్రిక్‌ ఫోర్స్‌ సాధించాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ 3 ఓవర్లు ముగిసే సరికి 20 పరగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 11 బంతుల్లో 14 పరుగులు,కైల్‌ మేయర్స్‌ 7 బంతుల్లో 6 పరుగులు చేశారు.

  • తొలి ఓవర్‌ మెయిడిన్‌

గుజరాట్‌ టైటాన్స్‌ నిర్దేశించిని 136 పరుగలు లక్ష్య చేదనకు లక్నో సూపర్‌ జెయింట్స్‌ బ్యాటింగ్‌కు దిగింది. కేఎల్‌ రాహుల్‌, కైల్‌ మేయర్స్‌ క్రీజులోకి వచ్చారు. గుజరాత్‌ శుభ్‌మాన్‌ గిల్‌ స్థానంలో జయంత్‌ యాదవ్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా తీసుకుంది. షమీ వేసిన తొలి ఓవర్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ పరుగులేమి చేయలేదు.

  • లక్నో ముందు సింపుల్‌ టార్గేట్‌.. గుజరాత్‌ 135/6

లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌ టైటాన్స్‌, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో హార్ధిక్‌ పాండ్యా, 55 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 66 పరుగులు, వృద్ధిమాన్‌ సాహా, 37 బంతుల్లో 6 ఫోర్లతో 47 మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలవమవ్వడంతో గుజరాత్‌ 135 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ మ్యాచ్‌లో నవీన్‌ వుల్‌ హక్‌ వేసిన తొలి ఓవర్‌లో 4 పరుగులు మాత్రమే రాగా రెండో ఓవర్‌లోనే బౌలింగ్‌కి వచ్చిన కృనాల్‌ పాండ్యా.. శుబ్‌మన్‌ గిల్‌ని డకౌట్‌ చేశాడు.. కృనాల్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన శుబ్‌మన్‌ గిల్‌, రవి బిష్ణోయ్ కి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. 4 పరుగుల వద్ద గుజరాత్‌ టైటాన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. గుజరాత్‌ టైటాన్స్‌ పవర్‌ ప్లే ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 40 పరుగులు చేసింది. ఈ క్రమంలో సాహా, 37 బంతుల్లో 6 ఫోర్లతో 47 పరుగులు చేసి కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లోనే దీపక్‌ హుడాకి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. 5 బంతుల్లో 3 పరుగులు చేసిన అభినవ్‌ మనోహార్‌, సాహా అవుటైన తర్వాతి ఓవర్‌లోనే భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్‌ చేరాడు. ఆ వెంటనే విజరు శంకర్‌, నవీన్‌ వుల్‌ హక్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఈ క్రమంలో రవి బిష్ణోయ్ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో వరుసగా 4, 6, 6 బాదిన హార్ధిక్‌ పాండ్యా.. హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. మార్కస్‌ స్టోయినిస్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో మొదటి బంతికి సిక్సర్‌ బాదిన హార్ధిక్‌ పాండ్యా, 55 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 66 పరుగులు చేసి కెఎల్‌ రాహుల్‌కి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. డేవిడ్‌ మిల్లర్‌ 12 బంతులు ఆడి 6 పరుగులు చేసి ఆఖరి బంతికి అవుట్‌ కాగా రాహుల్‌ తెవాటియా 2 బంతుల్లో 2 పరుగులు చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో కృనాల్ పాండ్యా 2, మార్కస్ స్టొయినిస్ 2, నవీనుల్ హక్ 1, అమిత్ మిశ్రా 1 వికెట్ తీశారు.

  • పాండ్యా ఔట్‌

50 బంతుల్లో 66 పరుగులు చేసిన గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మార్కస్‌ స్టోయినిస్‌ బౌలింగ్‌లో కేఎల్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి రాహుల్‌ తెవాటియా వచ్చాడు.

  • పాండ్యా 50

గుజరాత్‌ కెప్టెన్‌ హర్దిక్‌ పాండ్యా హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. పాండ్యా 44 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. 18 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్‌ 121 పరుగులు చేసి

 

  • 100 దాటిన గుజరాత్‌ స్కోరు.. గుజరాత్‌ :102/4

17 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్‌ 4 వికెట్ల నష్టానికి 102 పరగులు చేసింది. గుజరాత్‌ కెప్టెన్‌ హర్దిక్‌ పాండ్యా నెమ్మదిగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 41 బంతులు ఆడిన పాండ్యా కేవలం 40 పరగులు మాత్రమే చేశారు. పాండ్యా ఇన్నింగ్స్‌లో ఫోర్‌, సిక్స్‌ మాత్రమే ఉంది. మరో వైపు మిల్లర్‌ 5 బంతులు ఆడి 2 పరుగులు చేశాడు.

  • 15 ఓవర్లు పూర్తి..

15 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్‌ 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా నెమ్మదిగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. పాండ్యా 34 బంతుల్లో 32 పరుగులు చేశాడు. విజరు శంకర్‌ 13 బంతుల్లో 10 పరగులు చేసి ఔటయ్యాడు. క్రీజులోకి మిల్లర్‌ వచ్చాడు.

  • 3వ వికెట్‌ డౌన్‌.. గుజరాత్‌ : 78/3

అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో అభినవ్‌ మనోహర్‌ (3) ఔటయ్యాడు. అభినవ్‌ మనోహర్‌ ఇచ్చిన క్యాచ్‌ను నవీన్‌ ఉల్‌ హాక్‌ అద్భుంతగా ఆదుకున్నాడు. 12 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 78/3. హార్ధిక్‌ (27), విజరు శంకర్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు.హొ

  • సాహా ఔట్‌.. గుజరాత్‌ 72 /2

47 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్న వృద్ధిమాన్‌ సాహా కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్‌లోని 3వ బంతిని షాట్‌కు ప్రయత్నించి సాహా దీపక్‌హుడ్డాకు చిక్కాడు. దీంతో గుజరాత్‌ 72 పరగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. క్రీజులోకి అభినవ్‌ మనోహార్‌ వచ్చాడు. పాండ్యా 25 బంతుల్లో 26 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

  • 10 ఓవర్లు పూర్తి.. గుజరాత్‌ 71/1

10 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్‌ టైటాన్స్‌ వికెట్‌ 71 పరగులు చేసింది. వృద్ధిమాన్‌ సాహా 36 బంతుల్లో 47 పరుగులు చేశాడు. పాండ్యా 22 బంతుల్లో 24 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. లక్నో జట్టు మరో వికెట్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తోంది.

  • పవర్‌ ప్లే పూర్తి..

పవర్‌ ప్లే పూర్తయ్యే సమయానికి గుజరాత్‌ టైటాన్స్‌ 1 వికెట్‌ నష్టానికి 40 పరుగులు చేసింది. వృద్ధిమాన్‌సాహా దూకుడుగా ఆడుతూ.. స్కోరుబోర్డును ముందుకు తీసుకువెళ్తున్నారు. సాహా 24 బంతుల్లో 34, పాండ్యా 10 బంతుల్లో 6 పరుగులు చేశారు.

  • 3 ఓవర్లు పూర్తి..  

3 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్‌ టైటాన్స్‌ 13 పరుగులు మాత్రమే చేసింది. వృద్ధిమాన్‌సామా 9, హార్ధిక్‌పాండ్యా 5 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నారు.

  • గిల్‌ డక్‌ ఔట్‌

టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌ టైటాన్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగలిగింది. జట్టు ప్రధాన బ్యాటర్‌ శుభ్‌మాన్‌ గిల్‌ డకౌట్‌ అయ్యాడు. కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో రవి బిష్ణోరుకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేశాడు.. క్రీజులోకి హార్దిక్‌ పాండ్యా వచ్చాడు. గుజరాత్‌ టైటాన్స్‌ ప్రస్తుతానికి 5 పరుగులు చేసింది. వృద్ధిమాన్‌సాహా 4 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

  • టాస్‌ నెగ్గిన గుజరాత్‌ టైటాన్స్‌

ఐపీఎల్‌ 2023లో భాగంగా లక్నోలోని భారతరత్న శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్‌ స్టేడియంలో ఇవాళ (ఏప్రిల్‌ 22 మధ్యాహ్నం 3:30 గంటలకు) లక్నో సూపర్‌ జెయింట్స్‌-గుజరాత్‌ టైటాన్స్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గుజరాట్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తొలుత బౌలింగ్‌ చేయనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. నూర్‌ అహ్మద్‌ జట్టులోకి వచ్చాడు.

 

లక్నో సూపర్‌ జెయింట్స్‌ : కేఎల్‌ రాహుల్‌ , కైల్‌ మేయర్స్‌, దీపక్‌ హుడా, మార్కస్‌ స్టోయినిస్‌, కనాల్‌ పాండ్యా, నికోలస్‌ పూరన్‌, ఆయుష్‌ బడోని, నవీన్‌-ఉల్‌-హక్‌, అమిత్‌ మిశ్రా, అవేష్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్

గుజరాత్‌ టైటాన్స్‌ :వృద్ధిమాన్‌ సాహా , శుభమాన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యా, విజరు శంకర్‌, అభినవ్‌ మనోహర్‌, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాటియా, రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ షమీ, నూర్‌ అహ్మద్‌, మోహిత్‌ శర్మ