ఆస్ట్రేలియా 255/4
అహ్మదాబాద్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో గురువారం నుంచి ప్రారంభమైన నాల్గో టెస్ట్‌లో భారత బౌలర్లు తేలిపోయారు. ఓపెనర్ ఖవాజా(104నాటౌట్) సెంచరీకి తోడు చివర్లో గ్రీన్(49నాటౌట్) కూడా బ్యాటింగ్‌లో మెరవడంతో ఆసీస్ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4వికెట్ల నష్టానికి 255పరుగులు చేసింది. బ్యాటర్లకు సహకరించిన ఈ పిచ్‌పై భారత బౌలర్లు వికెట్లు రాబట్టేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ట్రెవిస్ హెడ్-ఉస్మాన్ ఖవాజా తొలి వికెట్‌కు 61పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడీని రవిచంద్రన్ అశ్విన్ విడదీసాడు. వ్యక్తిగత స్కోర్ 32 పరుగుల వద్ద ట్రెవిస్ హెడ్(32)ను అశ్విన్ ఔట్ చేశాడు. దీంతో అశ్విన్ భారత్‌కు తొలి బ్రేక్‌ను అందించాడు. మరోవైపు షమీ ఓ గుడ్‌లెంగ్త్ బంతికి లబూషేన్‌ను బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియా జట్టు లంచ్‌లోపే రెండు వికెట్లు కోల్పోయి 75పరుగులు చేసింది. లంచ్-టీ విరామం లోపు భారత బౌలర్లు వికెట్లు రాబట్టేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. టీ విరామం వరకు ఆస్ట్రేలియా బ్యాటర్స్ మరో వికెట్ కోల్పోకుండా ఆచి తూచి ఆడారు. ఎక్కువభాగం డిఫెన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో భారత బౌలర్లు మరో వికెట్ సాధించలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు లంచ్ విరామ సమయానికి 62ఓవర్లలో 2వికెట్లు కోల్పోయి 149పరుగులే చేయగల్గింది. లంచ్ తర్వాత భారత బౌలర్లు కెప్టెన్ స్మిత్(32), హ్యాండ్‌కోంబ్(17) వికెట్లను పడగొట్టి ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీ(104 నాటౌట్)తో జట్టును ఆదుకున్నాడు. ఓపికగా ఆడిన అతను భారత బౌలర్లకు పరీక్ష పెట్టాడు. చివర్లో ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్(49) కూడా బ్యాటింగ్‌లో రాణించడంతో ఆసీస్ మరో వికెట్ కోల్పోకుండా అడ్డుకున్నారు. షమీకి రెండు, అశ్విన్, జడేజాకు ఒక్కో వికెట్ దక్కాయి.
సిరీస్‌లో తొలి శతకం
మూడో టెస్టులో అర్ధ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా.. నాలుగో టెస్టులోనూ చెలరేగాడు. స్మిత్‌తో కలిసి మూడో వికెట్‌కు 79 జోడించిన ఖవాజా.. టీ విరామం ఆ తర్వాత గ్రీన్‌తో స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ సిరీస్‌లో శతకం బాదిన తొలి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా ఖవాజా గుర్తింపు సాధించాడు. అంతేకాదు గత పదమూడేళ్లలో భారత్‌లో ఆడిన 12 టెస్టుల్లో సెంచరీ కొట్టిన ఆసీస్ మొదటి ఎడమచేతి వాటం ఆటగాడిగా ఖవాజా రికార్డు నెలకొల్పాడు.
స్కోర్‌బోర్డు..
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: ట్రెవిస్ హెడ్ (సి)జడేజా (బి)అశ్విన్ 32, ఖవాజా (బ్యాటింగ్) 104, లబూషేన్ (బి)షమీ 3, స్మిత్ (బి)అశ్విన్ 38, హ్యాండ్‌కోంబ్ (బి)షమీ 17, గ్రీన్ (బ్యాటింగ్) 49, అదనం 12. (90 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 255పరుగులు.
వికెట్ల పతనం: 1/61, 2/72, 3/151, 4/170
బౌలింగ్: షమీ 17-2-65-2, ఉమేశ్ యాదవ్ 15-2-58-0, అశ్విన్ 25-8-57-1, జడేజా 20-2-49-1, అక్షర్ పటేల్ 12-4-14-0, శ్రేయస్ 1-0-2-0










