అమరావతి : అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసుకు సంబంధించి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వరుసగా రెండో రోజు బుధవారం సిఐడి విచారణకు హాజరయ్యారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి లోకేశ్ చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. నిన్న (మంగళవారం) ఆరున్నర గంటలపాటు సాగిన విచారణలో సిఐడి అధికారులు మొత్తం 50 ప్రశ్నలు అడిగారని.. వాటిలో 49 ప్రశ్నలు ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేనివేనని లోకేశ్ వెల్లడించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేని అంశాలపై సిఐడి అధికారులు తనను ప్రశ్నించారని లోకేశ్ తెలిపారు.










