Jun 07,2023 15:09

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌(అన్నమయ్యజిల్లా) : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రను జయప్రదం చేయాలని టీడీపీ పార్లమెంట్‌ అభ్యర్థి గంటా నరహరి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 08వ తేదీ గురువారం సాయంత్రం 4.00 గంటలకు సిద్ధవటం మండలం టక్కోలి నుండి యువ గళం పాదయాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా నరహరి మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గంలోకి లోకేష్‌ అడుగు పెడుతున్న సందర్భంగా రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపి కుటుంబ సభ్యులు, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్‌ ఇంచార్జిలు, యూనిట్‌ ఇంచార్జిలు, వార్డు కమిటీ అధ్యక్షులు, బూత్‌ కన్వీనర్లు, అనుబంధ విభాగాల నాయకులు, యువకులు, మహిళలు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ పాదయాత్రకు పెద్ద ఎత్తున హాజరై, పార్టీకి నూతన ఉత్తేజం తీసుకురావలసిన భాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ యువగళం పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు.