May 16,2023 21:51

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌కు ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాడు కిర్గియోస్‌ దూరమయ్యాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో గాయపడ్డ కిర్గియోస్‌.. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకొన్నాడు. ఆ గాయంనుంచి ఇంకా పూర్తిగా కోలుకోని కారణంగా కిర్గియోస్‌ త్వరలో జరగనున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పాల్గొనడం లేదని ట్విటర్‌ వేదికగా టోర్నీ నిర్వాహకులకు తెలిపాడు. 28ఏళ్ల కిర్గియోస్‌ ఇప్పటివరకు ఐదుసార్లు రోలాండ్‌ గారోస్‌ క్లే కోర్టులో ఆడినా.. ఏనాడూ మూడోరౌండ్‌ను దాటలేకపోయాడు. 2022లో వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు చేరినా.. 2017 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రెండోరౌండ్‌లోనే ఓటమిపాలయ్యాడు.

ఇటాలియన్‌ ఓపెన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు జకో..

djacko

ఆరుసార్లు ఇటాలియన్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ నొవాక్‌ జకోవిచ్‌ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన ప్రి క్వార్టర్‌ఫైనల్లో జకోవిచ్‌ 6-3, 6-4తో కేమరూన్‌ నొర్రీపై వరుససెట్లలో గెలిచాడు. ఇక మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి టాప్‌సీడ్‌ ఇగా స్వైటెక్‌ ప్రవేశించింది. క్వార్టర్స్‌లో స్వైటెక్‌.. డొన్నా వేకిక్‌తో తలపడనుంది.