May 31,2023 21:28

అగర్తల: త్రిపుర పురుషుల క్రికెట్‌ జట్టు ప్రధాన సలహాదారుగా దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ లాన్స్‌ క్లుసెనర్‌ నియమించబడ్డాడు. ఈ విషయాన్ని త్రిపుర క్రికెట్‌ అసోసియేషన్‌ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. రాబోయే దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ నుంచి లాన్స్‌ క్లుసెనర్‌ జాతీయ జట్టుకు అందుబాటులో ఉంటాడని, అతని సేవలతో జట్టు అద్భుత ప్రదర్శనను కనబరుస్తుందన్న ధీమా త్రిపుర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆ ప్రకటనలో వెల్లడించింది. ఈ విషయాన్ని త్రిపుర క్రికెట్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ తిమిర్‌ చందా తెలిపారు. అనుభవజ్ఞుడైన కోచ్‌ మొత్తం 100రోజులు పనిచేస్తాడని, రాబోయే రంజీట్రోఫీ సీజన్‌ వరకు క్లుసెనర్‌ జాతీయ జట్టుకు అందుబాటులో ఉంటాడని ఆయన తెలిపారు.