ఇంటర్నెట్‌డెస్క్ : ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్, హీరోయిన్ నయనతార కలిసి నటించిన చిత్రం 'జవాన్'. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌కొట్టింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలోని సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమాలో నయనతార, షారుక్‌ఖాన్‌ల రొమాన్స్ సాంగ్ అయిన 'చెల్ చెల్ చెలోనా' పాటకి ప్రముఖ నటి కీర్తిసురేష్ స్టెప్పులేశారు. కీర్తితోపాటు నటి, ప్రముఖ దర్శకుడు అట్లీ భార్య ప్రియా అట్లీ కూడా కీర్తితోపాటు డ్యాన్స్ చేశారు. వీరిద్దరూ కలిసి జవాన్ పాటకి డ్యాన్స్ చేస్తున్న వీడియోను కీర్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను పలువురు బాలీవుడ్ నటులు, నెటిజన్లు వీక్షించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు డ్యాన్స్ బాగుందని కామెంట్స్ చేశారు.










