న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు మరోసారి చర్చనీయాంశమవుతోంది. గత కొద్ది రోజులుగా స్తబ్ధతగా ఉన్న ఈ కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, సిఎం కెసిఆర్ కుమార్తె కల్వకుంట కవితకు తాజాగా ఇడి నోటీసు జారీచేసింది. శుక్రవారం విచారణకు హాజరుకావాలంటూ నోటీసులో పేర్కొంది. కవితను అరెస్టు చేస్తారని గతంలోనే వార్తలొచ్చాయి. అరెస్టు జరగకపోవడంతో బిఆర్‌ఎస్, బిజెపి ఒక్కటేనని ఆరోపణలకు తావిచ్చింది. ఈ తరుణంలో ఉన్నట్టుండి కవితకు నోటీసులు ఇవ్వడం మరోసారి చర్చకు దారి తీసింది. సౌత్ గ్రూప్‌లో ఉన్నవాళ్లంతా అఫ్రూవర్లుగా మారిపోయారు. దీంతో ఈ కేసు మళ్లీ మొదటికొచ్చింది. ఇందులో భాగంగానే కవితకు ఇడి మళ్లీ నోటీసులు ఇచ్చిందన్న చర్చ నడుస్తున్నది.










