Jul 23,2023 13:35

కడుపులో నొప్పిగా ఉందని హాస్పిటల్‌కు వెళ్లాడు వెంగళప్ప..
డాక్టర్‌ : సమస్య ఏంటి..?
వెంగళప్ప : కడుపులో నొప్పి సార్‌.. గత కొన్ని రోజులుగా ఇలాగే ఉంది.
డాక్టర్‌ : మీరు ఫాస్ట్‌ ఫుడ్‌, రోడ్డు పక్కన చేసే ఫుడ్‌ తిన్నారా?
వెంగళప్ప : అవును డాక్టర్‌.. అందుకే ఈ సమస్య వచ్చింది.
డాక్టర్‌ : టెస్టులు చేశాను. నేను రాసిచ్చే ట్యాబ్లెట్లు మూడు రోజులు వాడితే తగ్గిపోతుంది.
వెంగళప్ప : డాక్టర్‌ గారు..ఈ టాబ్లెట్లు బయటకొనాల్సిందేగా?వేసుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏవీ రావు కదా?
డాక్టర్‌ : ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసీ.. బయట అడ్డమైనవి తింటారు. స్మోకింగ్‌, డ్రింకింగ్‌ కూడా చేస్తారు.. కానీ డాక్టర్‌ మెడిసిన్‌ రాసిస్తే మాత్రం ఎక్కడలేని అనుమానాలోస్తాయి మీకు..