బంగ్లాదేశ్ బౌలర్ లిట్టన్ దాస్ కుటుంబ అత్యవసర పరిస్థితుల కారణంగా ఏప్రిల్ నెల చివర్లో స్వదేశానికి వెళ్లిపోవడం తెలిసిందే. కేకేఆర్ లిట్టన్ దాస్‌కు బదులు వెస్టిండీస్‌కు వికెట్ కీపర్, బ్యాటర్ జాన్సన్ చార్లెస్‌ను జట్టులోకి చేర్చుకుంది. జాన్సన్ చార్లెస్‌ను రూ.50 లక్షలకు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. జాన్సన్ చార్లెస్ వెస్టిండీస్ తరఫున 41 టీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో పాల్గొన్నాడు. 971 పరుగుల స్కోర్ చేశాడు. 2012, 2016 ఐసీసీ వరల్డ్ టీ20 విజయాల్లోనూ పాలు పంచుకున్నాడు.










