ప్రజాశక్తి-నందిగామ : జగనన్నకు చెబుదాం పధకం అంతా బూటకమని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ పేర్కొన్నారు. గురువారం గురువారం ఉదయం నందిగామ సుందరయ్య భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో డివి కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నకు చెబుదాం.. జగనన్నే మా నమ్మకం వంటి పథకాలు అంతా కల్లబొల్లి మాటలని విమర్శించారు. ఏ .కొండూరు మండలంలో దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల చెందిన 14 మంది ధాన్యం రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా ధాన్యం అమ్ముకుంటే రూ.11 లక్షల 40 వేలు రెండున్నర సంవత్సరాల క్రితం ఇవ్వాలని ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అదేమని ప్రశ్నించిన రైతులపై అధికారులు తిరగబడుతున్నారని ఆ రైతుల సమస్యలు పరిష్కరించడంలో కలెక్టర్లు, అధికారులు ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఎన్టీఆర్ జిల్లాలో వేలాది ఎకరాల్లో ధాన్యం, మొక్కజొన్న ,పత్తి మిర్చి అపరాల పంటలు పూర్తిగా తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయినా రైతన్న ఆడుకోవడంలో అధికారులు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతన్నను ఆదుకోవాలని ఆందోళన చేస్తున్నా పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం కాలయాపన చేస్తుందని తక్షణమే బాధ్యత కలిగి రైతాంగం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ కృష్ణా ప్రాంతంలో సుబాబులు రైతాంగానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం టన్నుకు 5000 రూపాయల గిట్టుబాటు ధర ప్రకారం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నందిగామ పట్టణంలో తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. జగనన్న కాలనీలు మొండి గోడలతో వెక్కిరిస్తున్నాయని జగన్ అన్న కాలనీలో మౌలిక వసతులు లేకపోవడం వల్ల ప్రజలు ఇల్లు నిర్మించుకోవడానికి ముందుకు రావడం లేదన్నారు. జగనన్న కాలనీకి లక్ష యాభై వేల రూపాయలు ఏ మూలకు సరిపోవడం లేదని కనీసం ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇల్లు పూర్తి చేసి ఇవ్వాలని నకిలీ విత్తనాలు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం తడిసిన మొక్కజొన్న పంటను మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కట్టారపు గోపాల్ సిపిఎం నాయకులు సయ్యద్ ఖాసిం , వి రవిశేఖర్ గోపి నాయక్ కరి వెంకటేశ్వర రావు, హస్సేను శ్రీనివాసరావు పాల్గొన్నారు.










