కంపోస్టు యార్డులో చెత్తను చదును చేస్తున్న జెసిబి : స్పందించిన మున్సిపల్ అధికారులు
ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : మండపేటలోని స్థానిక కంపోస్టు యార్డులో జెసిబి సాయంతో చెత్తను చదును చేసేందుకు మున్సిపల్ అధికారులు శనివారం చర్యలు చేపట్టారు. కంపోస్ట్ యార్డులో చెత్త కొండలా పేరుకుపోవడంతో పారిశుధ్య కార్మికులు చెత్తను డంపింగ్ చేయడం కత్తి మీద సాములా మారడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మున్సిపల్ కమిషనర్ టి రామ్ కుమార్ దృష్టికి సిఐటియు జిల్లా కార్యదర్శి కే.కృష్ణవేణి తీసుకువెళ్లి సమస్యను వివరించారు. స్పందించిన మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. చెత్తను చదును చేసే పనిలో మున్సిపల్ సిబ్బంది నిమగమయ్యారు. దీంతో కార్మికులు, సిఐటియు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.










