Jun 01,2023 21:58

లండన్‌: ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్డ్‌ బ్రాడ్‌ నిప్పులు చెరిగే బంతులకు ఐర్లాండ్‌లకు విల విలలాడింది. ఇరుజట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌కు మొగ్గు చూపింది. బ్రాడ్‌(4/47), లీచ్‌(2/35) దెబ్బకు ఐర్లాండ్‌ జట్టు టి విరామ సమయానికి 7వికెట్ల నష్టానికి 165పరుగులు చేసింది. ఐర్లాండ్‌ ఓపెనర్‌ మెక్‌కల్లమ్‌(36), స్టెర్లింగ్‌(30), ఛాపర్‌(32నాటౌట్‌) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. టీ విరామ సమయానికి అడైర్‌(10) క్రీజ్‌లో ఉన్నాడు.