Apr 30,2023 12:21

లండన్‌ ఓవల్‌ వేదికగా జూన్‌7 నుంచి భారత్‌-ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరగనుంది. ఇప్పటికే ఇరు క్రికెట్‌ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ గాయపడ్డాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఉమేష్‌ యాదవ్‌ మోకాలికి గాయమైంది. గాయం తీవ్రమైనది కావడంతో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ఉమేష్‌ దూరమయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఉమేష్‌ ఫిట్‌నెస్‌ సాధించకపోతే భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి.
భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానే, కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌, అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, ఉనద్కత్‌