Jan 26,2023 21:16

జకార్తా : ఇండోనేషియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ దూసుకెళ్లాడు. గురువారం జరిగిన రెండోరౌండ్‌ పోటీలో లక్ష్యసేన్‌ 19-21, 21-8, 21-17 తేడాతో ఎన్‌జి టియంగ్‌(మలేషియా)పై పోరాడి నెగ్గాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్న లక్ష్యసేన్‌ క్వార్టర్‌ఫైనల్లో జొనాథన్‌ క్రిస్టీ(ఇండోనేషియా)తో తలపడనున్నాడు. ఇక జొనాథన్‌ క్రిస్టీ వరుససెట్లలో కొడరు నరౌకాపై గెలి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకొచ్చాడు. ఇక మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ పోరాటం ముగిసింది. ప్రి క్వార్టర్స్‌లో సైనా 15-21, 17-21తో కేవలం 29 నిమిషాల్లోనే హన్‌-యు(చైనా) చేతిలో ఓటమిపాలైంది. పివి సింధుతో పాటు పురుషుల డబుల్స్‌ స్టార్‌ జోడీ సాత్త్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ ఈ టోర్నమెంట్‌కు దూరంగా ఉన్నారు.