Feb 18,2023 16:26
  •  ఆసీస్‌కు 1 పరుగు అధిక్యం

ఢిల్లీ : రెండో టెస్ట్‌లో భారత తొలి ఇన్నింగ్‌ 262 పరుగులకు అలౌట్‌ అయ్యింది. దీంతో ఆసీస్‌కు 1 పరుగు అధిక్యం లభించింది. 139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత జట్టు, 200ం పరుగులు చేయడమే కష్టమని అనిపించింది. అయితే రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ కలిసి ఏడో వికెట్‌కి 114 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పి భారత జట్టును ఆదుకున్నారు.
ఓవర్‌నైట్‌ స్కోరు 21/0 వద్ద రెండో రోజు బ్యాటింగ్‌ మొదలెట్టిన టీమిండియాకి నాథన్‌ లియాన్‌ ఊహించని షాక్‌ ఇచ్చాడు. 41 బంతుల్లో ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసిన కెఎల్‌ రాహుల్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ చేశాడు ఆ తరువాత 69 బంతుల్లో 2 ఫోర్లతో 32 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ, నాథన్‌ లియాన్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత రెండో బంతికి పూజారా వికెట్‌ కోల్పోయింది భారత జట్టు. 100వ టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న ఛతేశ్వర్‌ పూజారా, 7 బంతులు ఆడి పరుగులేమీ చేయకుండానే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ చేరాడు. 15 బంతుల్లో 4 పరుగులు చేసిన శ్రేయాస్‌ అయ్యర్‌, నాథన్‌ లియాన్‌ బౌలింగ్‌లో హ్యాండ్స్‌కోంబ్‌కి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. 46/0 స్కోరుతో ఉన్న వెంటవెంటనే 4 వికెట్లు కోల్పోయి 66/4 స్థితికి చేరుకుంది.
ఈ దశలో విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజా కలిసి ఐదో వికెట్‌కి 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 74 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, టాడ్‌ ముర్ఫీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ అయ్యాడు. ఆ తర్వాత విరాట్‌ కోహ్లీ 84 బంతుల్లో 4 ఫోర్లతో 44 పరుగులు చేసి మాథ్యూ కుహ్నేమాన్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ అయ్యాడు. 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన శ్రీకర్‌ భరత్‌, నాథన్‌ లియాన్‌ బౌలింగ్‌లో స్టీవ్‌ స్మిత్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు..
139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో ఆల్‌రౌండర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ కలిసి ఆసీస్‌ బౌలర్లకు పరీక్ష పెట్టారు. 71 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేసిన రవిచంద్రన్‌ అశ్విన్‌, ప్యాట్‌ కమ్మిన్స్‌ బౌలింగ్‌లో రంషో పట్టిన అద్భుతమైన క్యాచ్‌కి అవుట్‌ అయ్యాడు. దీంతో 114 పరుగుల 8వ వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. 115 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేసిన అక్షర్‌ పటేల్‌, టాడ్‌ ముర్ఫీ బౌలింగ్‌లో ప్యాట్‌ కమ్మిన్స్‌ గాల్లోకి ఎగురుతూ పట్టిన క్యాచ్‌కి పెవిలియన్‌ చేరాడు. 2 పరుగులు చేసిన షమీని కుహ్నేమన్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో 262 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్‌కి తెరపడింది. ఆసీస్ బౌలర్లలో లైయన్ 5, కుహ్నెమన్ 2, టాడ్ మర్ఫీ 2, కమిన్స్ 1 వికెట్ తీశారు. 

 

  • అక్షర్‌ హాఫ్‌ సెంచరీ.. భారత్‌ 231/7

రెండో టెస్ట్‌లో భారత ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ హాప్‌ సెంచరీ సాధించాడు. 91 బంతులు ఆడిన అక్షర్‌ 51 పరుగులతో క్రీజులో ఉన్నాడు. టాప్‌ ఆర్డర్‌ విఫలమైన వేళ ఆసీస్‌ బౌలర్లను ఆచితూచి ఆడుతూ.. పరుగులు సాధిస్తున్నాడు. మరో వైపు నుంచి ఆశ్విన్‌ అక్షర్‌కు చక్కని సాయం అందిస్తున్నాడు. 64 బంతులు ఆడిన ఆశ్విన్‌ 35 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతానికి భారత్‌ 77 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 231 పరుగులు సాధించింది.

  • లియోన్‌కు 5 వికెట్లు.. భారత్‌ 179/7

రెండో టెస్ట్‌లో టీ బ్రేక్‌ సమయానికి భారత్‌ 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. 7వ వికెట్‌గా వికెట్‌ కీపర్‌ శ్రీకర్‌ భరత్‌ను లియోన్‌ ఔట్‌ చేశాడు. ప్రస్తుతం అక్షర్‌ పటేల్‌ (28), ఆశ్విన్‌ (11) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్‌ ఇంకా 84 పరుగుల వెనుకంజలో ఉంది.

  • కష్టాలో భారత్‌.. కోహ్లీ ఔట్‌

ఆసీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్‌ కష్టాలో పడింది. లంచ్‌ బ్రేక్‌ తరువాత వెంటవెంటనే వికెట్లు కోల్పోతూ పరుగులు చేయడంలో విఫలమవుతోంది. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న కోహ్లీ స్పినర్‌ కుహ్నెమాన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 44 పరుగులు చేసిన కోహ్లీ తృటిలో హాఫ్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. ప్రస్తుతానికి క్రీజులో శ్రీకర్‌ భరత్‌, అక్షర్‌ పటేల్‌ ఉన్నారు.

1
  • జడేజా ఔట్‌.. భారత్‌ 135/5

ఢిల్లీ వేదికగా జరగుతున్న రెండో టెస్ట్‌లో భారత్‌ 5వ వికెట్‌ కోల్పోయింది. 26 పరుగులు చేసిన జడేజా మార్ఫీ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతానికి భారత్‌ స్కోరు 135/5 గా ఉంది. క్రీజులో శ్రీకర్‌ భరత్‌, కోహ్లీ ఉన్నారు. లంచ్‌ బ్రేక్‌కు ముందు. రాహుల్‌, రోహిత్‌, పుజారా, శ్రేయస్‌ అయ్యార్‌ను లియోన్‌ ఔట్‌ చేశాడు.

  • రెండో రోజు ఆట ప్రారంభం.. 4 వికెట్లు డౌన్‌

ఢిల్లీ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఆస్ట్రేలియా తమ బౌలింగ్‌ స్పిన్‌తో ప్రారంభించింది. ఓవర్ నైట్ స్కోరు 21/0తో మూడో రోజు ఆట కొసాగించిన భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 46 పరుగుల స్కోరు వద్ద కేఎల్ రాహుల్ (17) ఔటయ్యాడు. ఆ వెంటనే ఒకే ఓవర్లో రోహిత్ శర్మ (32)తో పాటు చతేశ్వర్ పుజారా (0) పెవిలియన్ చేరారు.కెరీర్ లో వందో టెస్టు ఆడుతున్న పుజారా డకౌట్ గా వెనుదిరి తీవ్ర నిరాశపరిచాడు. కొద్దిసేపటికే శ్రేయస్ అయ్యర్ (4) సైతం పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఉన్నారు.