Apr 03,2023 11:44

ఇంటర్నెట్‌డెస్క్‌ : వేసవిలో చద్దన్నం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ కాలంలో ప్రతిరోజూ ఉదయాన్నే చద్దన్నం తింటే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

చద్దన్నం వల్ల ప్రయోజనాలు
వేసవిలో వండిన అన్నం త్వరగా పులిసిపోతుంది. రాత్రి వండిన అన్నాన్ని మజ్జిగలో వేసి మరుసటిరోజు తింటే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఉదయాన్నే ఈ అన్నంలో మరికొంత పెరుగు వేసుకుని.. మిరపకాయ, ఉల్లిపాయతో నంజుకుని తింటే టేస్టీగా ఉంటుంది. చద్దన్నం తింటే తక్షణ శక్తి వస్తుంది. దీన్ని తినడం వల్ల డీహైడ్రేషన్‌, అలసట, బలహీనతను దూరం చేసే శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది.
- చద్దన్నంలో పొటాషియం, సోడియం, క్లోరైడ్‌, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి.
- చద్దన్నం తింటే ఎముకల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. అలాగే పలు రకాల ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్‌ వంటి ప్రమాదకరమైన వ్యాధులను కూడా నివారించేందుకు సహాయపడుతుంది.