Feb 28,2023 10:23

హైదరాబాద్‌ : గూగి రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఏకకాలంలో 20 చోట్ల రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల డైరెక్టర్ల నివాసాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వివరాల ప్రకారం.. గూగి కంపెనీ ఫార్మా హిల్స్‌, వండర్‌ సిటీ, రాయల్‌ సిటీ పేర్లతో హైదరాబాద్‌లో కార్యకలాపాలు సాగిస్తోంది. మంగళవారం ఐటీ అధికారులు గూగికి సంబంధించిన కంపెనీల డైరెక్టర్ల నివాసాలపై 20 చోట్ల ఒకే సమయంలో సోదాలు నిర్వహించారు. ఇక, దిల్‌షుక్‌నగర్‌లోని గూగి ప్రధాన కార్యాలయంలో ఐదు బృందాలతో ఐటీ దాడులు జరుపుతోంది.