Jun 14,2023 20:57
  • రహానే 37, శార్దూల్‌ కు 94వ ర్యాంక్‌

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మరోసారి టాప్‌ లేపాడు. అలాగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యుటిసి) ఫైనల్లో మెరుగైన ఆటను ప్రదర్శించిన అజింక్య రహానే, శార్దూల్‌ ఠాకూర్‌లు ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నారు. రహానే 37వ స్థానంలో, శార్దూల్‌ 94వ స్థానంలో ఉన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో రహానే 89, 46 రన్స్‌ చేయగా, శార్దూల్‌ కీలకమైన హాఫ్‌ సెంచరీ చేశాడు. ఇక టెస్టు బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ టాప్‌ బౌలర్‌గా నిలిచారు. ఆస్ట్రేలియాకు చెందిన ముగ్గురు బ్యాటర్లు టాప్‌ ప్లేస్‌ కొట్టేవారు. ఆ జాబితాలో స్టీవ్‌ స్మత్‌, ట్రావిస్‌ హెడ్‌, మార్నస్‌ లబుషేన్‌ ఉన్నారు. గాయం నుంచి కోలుకుంటున్న వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ మాత్రం ర్యాంకింగ్స్‌ లిస్టులో టాప్‌లో ఉన్నారు. పంత్‌ పదో ర్యాంక్‌లో ఉండగా, రోహిత్‌.. కోహ్లీలు 12, 13వ స్థానాల్లో ఉన్నారు. బ్యాటింగ్‌లో 903 రేటింగ్‌ పాయింట్లతో లబుషేన్‌ తొలిస్థానంలో ఉన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో 121, 34 రన్స్‌ కొట్టిన స్మిత్‌(885) రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఇక మరో సెంచరీ హీరో ట్రావిస్‌ హెడ్‌(884) మూడో స్థానంలో ఉన్నాడు. ముగ్గురు టాప్‌ బ్యాటర్లు ఒకే దేశానికి చెంది ఉండడం చాలా అరుదు. గతంలో 1984లో ఒకసారి ఇలా జరిగింది. విండీస్‌ ప్లేయర్లు గ్రీనిడ్జ్‌, క్లైవ్‌ లాయిడ్‌, లారీ గోమ్స్‌లు టాప్‌ ప్లేస్‌ కొట్టేశారు.