May 08,2023 11:36

దుబాయ్ : ఐసీసీ తాజాగా (మే 8) విడుదల చేసిన వన్డే టీమ్‌ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాకింగ్స్‌లో ఆస్ట్రేలియా టాప్‌ ర్యాంక్‌కు, టీమిండియా రెండో స్థానానికి ఎగబాకాయి. పాకిస్తాన్‌ మూడో స్థానానికి పడిపోయింది. 48 గంటల కిందటే టాప్‌ ర్యాంక్‌కు చేరిన పాక్‌ ఆస్థానాన్ని కాపాడుకోలేక పోయింది. కాగా టీమిండియా, ఆస్ట్రేలియాకు సమానమైన రేటింగ్‌ పాయింట్లు (113) ఉండగా.. పాక్‌కు (112), ఇంగ్లండ్‌ (111), న్యూజిలాండ్‌ (108), సౌతాఫ్రికా (101), బంగ్లాదేశ్‌ (95), శ్రీలంక (86), వెస్టిండీస్‌ (72), ఆఫ్ఘనిస్తాన్‌ (71) వరుసగా ఐదు నుంచి పది స్థానాల్లో నిలిచాయి.