Jul 23,2022 07:41

ఒకపక్క మానవుడు సముద్రపు ఉప్పునీటిని మంచినీటిగా మార్చి నీటికొరత తీర్చుకుంటున్నాడు. సముద్రం అంటే నీరని మనిషైనవాడు ప్రతి ఒక్కడికి తెలుసు. అలాంటి సముద్రానికి నిన్న ముఖ్యమంత్రి గారు రామాయపట్నం పోర్టు ఫౌండేషన్‌ కి వచ్చినపుడు పట్టువస్త్రాలు సమర్పించటం ఎమిటి? సముద్రం వస్త్రాలు ధరిస్తదా! కొన్ని గ్రంథాలలో సముద్రం పురుషుడని రాసుకున్నారు. అంటే సముద్ర పురుషుడు పంచలు కట్టుకుంటాడో, మరి బ్రిటీషు వాడు అలవాటు చేసిన ప్యాంట్లు వేసుకుంటాడో! లేక అరనిక్కర్లు వేసుకుంటాడా! మరి నిన్న పురోహితులువారు పట్టు చీరలు సమర్పించాడా లేక పట్టు ధోవతులు సమర్పించాడా! వారం రోజుల క్రితం తమిళనాడులో ఒక ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన ఎంపీ సెంథిల్‌ అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన మతపరమైన తంతును చూసి, చీవాట్లు పెట్టాడు. అది చూసిన పురోహితుడు భయపడి పారిపొయాడు. అధికారులకు చెమట్లు పట్టాయి. అలా ఉండాలి ప్రజా ప్రతినిధులు. అంతేకాని సముద్రానికి పట్టువస్త్రాలు సమర్పించట మేమిటి? ఏకాలంలో ఉన్నాం మనం? రాజ్యాంగం, సెక్యులరిజం, రాజ్యాంగ సూత్రాలు పట్టవా మన మంత్రులకు, అధికారులకు! ఇకనయినా అధికారులు, ప్రజా ప్రతినిధులు సముద్రానికి ప్యాంట్లు, చొక్కాలు, పంచలు, అర నిక్కర్లు తొడగటం మానుకోవాలి.
 

- నార్నె వెంకట సుబ్బయ్య,
హేతువాద సంఘం అధ్యక్షుడు.