- చివరి రెండు నిమిషాల్లో రెండు గోల్స్ కొట్టి ఇంగ్లండ్‌పై గెలుపు
- కొరియాపై నెదర్లాండ్స్ గెలుపు
భువనేశ్వర్: ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్ సెమీఫైల్లోకి నెదర్లాండ్స్, జర్మనీ జట్లు ప్రవేశించాయి. బుధవారం జరిగిన తొలి క్వార్టర్‌ఫైనల్లో జర్మనీ జట్టు పెనాల్టీలలో 4-3గోల్స్ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించగా.. చివరి క్వార్టర్‌ఫైనల్లో నెదర్లాండ్స్ జట్టు 5-1గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై విజయం సాధించింది. జర్మనీ జట్టు మ్యాచ్ ముగియడానికి 2నిమిషాల ముందు వరకు 0-2గోల్స్‌తో వెనుకబడ్డా.. ఆ తర్వాత 58, 59వ ని.లో ఒక్కో గోల్స్ కొట్టడంతో ఇంగ్లండ్ జట్టు షాక్‌కు గురైంది. దీంతో నిర్ణీత సమయం పూర్తయ్యే సరికి ఇరుజట్లు 2-2గోల్స్‌తో సమంగా నిలిచాయి. ఇంగ్లండ్ జట్టు తరఫున వల్లెస్(12వ ని.), అన్‌సెల్(33వ ని.) ఒక్కో గోల్ కొట్టగా.. జర్మనీ తరఫున ఎం.గ్రాంబష్(58వ ని.), టి.గ్రాంబష్(59వ ని.) ఒక్కో గోల్ కొట్టారు. పెనాల్టీల్లో జర్మనీ వరుసగా నాలుగు గోల్స్ కొడితే.. ఇంగ్లండ్ తరఫున ఇద్దరు గోల్స్ చేయడంలో విఫలమయ్యారు. దీంతో జర్మనీ ఆటగాళ్లు సంబరాల్లో మునిగారు.
27న జరిగే సెమీఫైనల్స్...
ఆస్ట్రేలియా × జర్మనీ
బెల్జియం × నెదర్లాండ్స్










