ప్రజాశక్తి-అమరావతి : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ కోరుతూ ఆయన లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ ప్రారంభం కాగానే తమకు సమయం కావాలని చంద్రబాబు తరపు లాయర్లు ఏపీ హైకోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. మరోవైపు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. చంద్రబాబు తరఫు లాయర్ల పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది.










