Jul 24,2023 12:55
బరువు తగ్గేందుకు మాత్రలు వాడుతున్నారా?.. ప్రమాదమే..!

ఇంటర్నెట్‌డెస్క్‌ : తొందరగా బరువు తగ్గాలన్న ఆలోచనతో కొందరు డైట్‌ పిల్స్‌ వాడతారు. ఇలాంటి మాత్రలు వాడడం వల్ల.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
- మార్కెట్లో దొరికే డైట్‌ పిల్స్‌లో కెఫిన్‌, ఎఫెడ్రిన్‌ లేదా సినెఫ్రిన్‌ వంటివి ఉంటాయి. ఇవి హృదయ స్పందన రేటును పెంచే ఉత్ప్రేరకాలు. దీంతో ఇవి గుండె పనితీరుపై ప్రభావం చూపి గుండెపోటుకు కారణమయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
- కొన్ని డైట్‌ పిల్స్‌తో కాలేయం దెబ్బతినే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే వైద్యుల సలహా మేరకు తగిన మోతాదులో ఆహరం తీసుకుని క్రమంగా బరువు తగ్గడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.