ఓస్లో: నార్వే బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ డి. గుకేశ్ సంచలనం నమోదు చేశాడు. సోమవారం జరిగిన 9వ రౌండ్ ఉత్కంఠ పోటీలో 97 ఎత్తుల అనంతరం ప్రపంచ ఛాంపియన్ మాగస్ కార్ల్‌సన్‌పై సంచలన విజయం సాధించాడు. తొలుత ఆన్‌లైన్ క్లాష్‌లో ఇరువురు గ్రాండ్‌మాస్టర్లు ఒకేవిధంగా ఆడగా.. గుకేశ్‌కు క్వీన్ తిరిగి బోర్డుపైకి రావడం కలిసొచ్చింది. చివర్లో గుర్రం, రెండు బంటులతో గుకేశ్ అద్భుతంగా రాణించి కార్ల్‌సన్‌ను చిత్తుచేశాడు. కార్ల్‌సన్ ఓటమి అనంతరం గుకేశ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో 9వ రౌండ్ పోటీ అనంతరం నోడెర్మెక్(ఉజ్బెకిస్తాన్-6పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా.. కార్ల్‌సన్(నార్వే) 4.5పాయింట్లతో 7వ స్థానంలో , గుకేశ్ 2.5పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతున్నారు.










