- గుజరాత్ టైటాన్స్ లక్ష్యం 131పరుగులు
అహ్మదాబాద్: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-16లో ఢిల్లీ క్యాపిటల్స్ పేలవఫామ్ కొనసాగుతోంది. మంగళవారం గుజరాత్ జెయింట్స్‌పై తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత ఓవరు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 8వికెట్లు కోల్పోయి 130పరుగులే చేయగల్గింది. ఓ దశలో 23 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పీకల్లోతో కష్టాల్లో పడ్డ ఢిల్లీ 50 పరుగులు చేయడం కూడా కష్టమే అనిపించింది. అయితే అక్షర్ పటేల్(27), అమన్ ఖాన్(51), రిపల్ పటేల్(23) రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగల్గింది. ముఖ్యంగా, గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ దాడులను సమర్థవంతంగా అమన్ ఖాన్ ఎదుర్కొని అర్ధసెంచరీ నమోదు చేయడం విశేషం. అమన్ 44 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. చివర్లో రిపల్ పటేల్ 13 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 23 పరుగులు సాధించాడు. తొలుత ఇన్నింగ్స్ తొలి బంతికే ఫిలిప్ సాల్ట్(0) గోల్డెన్ డక్ అయ్యాడు. గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ షమీ నిప్పులు చెరిగే బంతులతో ఢిల్లీ క్యాపిటల్స్ టాపార్డర్‌ను కకావికలం చేశాడు. షమీ 4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 4 వికెట్లు తీసాడు. మోహిత్ శర్మకు రెండు, రషీద్‌ఖాన్‌కు ఒక వికెట్ దక్కాయి.
స్కోర్‌బోర్డు..
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి)మిల్లర్ (బి)షమీ 0, వార్నర్ (రనౌట్) రషీద్‌ఖాన్ 2, ప్రియమ్ గార్డ్ (సి)సాహా (బి)షమీ 10, రెన్ షా (సి)సాహా (బి)షమీ 8, మనీష్ పాండే (సి)సాహా (సి)షమీ 1, అక్షర్ పటేల్ (సి)రషీద్ ఖాన్ (బి)మోహిత్ శర్మ 27, అమన్ (సి)మనోహర్ (బి)రషీద్ ఖాన్ 51, రిపల్ పటేల్ (సి)హార్దిక్ పాండ్యా (బి)మోహత్ శర్మ 23, నోర్ట్జే (నాటౌట్) 3, కుల్దీప్ యాదవ్ (నాటౌట్) 0, అదనం 5. (20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 130పరుగులు.
వికెట్ల పతనం: 1/0, 2/6, 3/16, 4/22, 5/23, 6/73, 7/126, 8/130
బౌలింగ్: షమీ 4-0-11-4, హార్దిక్ పాండ్యా 1-0-10-0, లిట్టిల్ 3-0-27-0, రషీద్ ఖాన్ 4-0-28-1, నూర్ అహ్మద్ 4-0-20-0, మోహిత్ శర్మ 4-0-23-2.










