May 30,2023 21:12

ఐపిఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహణలో బిసిసిఐ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. వర్షం ముప్పు ఉన్న నేపథ్యంలో బోర్డు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై అన్నివైపుల నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత ధనిక బోర్డుగా గొప్పలు చెప్పుకునే భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ).. వర్షం నిలిచిన అనంతరం గ్రౌండ్‌ను సిద్ధం చేసేందుకు తీసుకొనే జాగ్రత్తలపై విమర్శలు వస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక సీట్ల సామర్థ్యం గల స్టేడియం గల అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్‌ స్టేడియం ముందస్తు జాగ్రత్తల్లో ఘోరంగా విఫలమైంది. ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా మధ్యలో భారీ వర్షం కురిస్తే.. కవర్లు కప్పేలోపే మైదానమంతా పూర్తిగా బురదగా మారింది. వర్షం నిలిచిన అనంతరం మైదానాన్ని సిద్ధం చేసేందుకు గ్రౌండ్‌మన్లు నానా తంటాలు పడ్డారు. డ్రెయిన్‌ మిషన్‌ లేక మైదానంపై స్పాంచ్‌లు తీసుకొని నీటిని బకెట్లలో తోడారు. వేల కోట్లు ఉన్న బిసిసిఐ ఒక్క డ్రెయింగ్‌ మిషన్‌ను కొనలేని పరిస్థితా.. అని అన్నివైపులనుంచి విమర్శలు వస్తున్నాయి.

2

 

3