భువనేశ్వర్: ఒడిషాలోని బిర్సాముండా అంతర్జాతీయ స్టేడియంలో జర్మనీతో జరుగుతున్న ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రొ లీగ్ తొలి మ్యాచ్‌లో భారతజట్టు 2-0గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తొలి రెండు క్వార్టర్స్ ముగిసే సమయానికి ఇరుజట్లు గోల్స్ చేయలేకపోయాయి. మూడో క్వార్టర్‌లో ప్రారంభం కాగానే హర్మన్‌ప్రీత్ ఒక గోల్ కొట్టగా.. సుఖ్‌జీత్ రెండు గోల్స్ చేశాడు. దీంతో 43వ నిమిషానికి భారత్ 3-0గోల్స్ ఆధిక్యతలో నిలిచినా.. తొలి క్వార్టర్స్ చివర్లో జర్మనీ తరఫున కూప్మన్ ఒక గోల్ కొట్టడంతో 3-1 ఆధిక్యతలో భారత్ నిలిచింది. ఇక నాల్గో క్వార్టర్ చివర్లో జర్మనీ తరఫున స్ట్రర్థాప్ ఒక గోల్ కొట్టడంతో 3-2కు భారత్ ఆధిక్యత తగ్గింది. ఇక భారత్‌కు మ్యాచ్ ముగియడానికి కొద్ది సెకన్ల ముందు ఒక పెనాల్టీ స్టోక్స్ లభించినా దానిని గోల్ చేయడంలో విఫలమైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సుఖ్‌జీత్ సింగ్‌కు లభించింది. చివరిసారిగా భారతజట్టు టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక పోటీలో 5-4గోల్స్ తేడాతో జర్మనీని ఓడించింది.










