- ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్
కైరో: ఈజిప్ట్ వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్ పోటీల్లో భారత యువ షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ థోమర్ స్వర్ణ పతకంతో సత్తా చాటాడు. బుధవారం జరిగిన 50మీ. రైఫిల్-3 పొజిషల్‌తో థోమర్ ఈ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. స్వర్ణ పతక పోటీలో ఐశ్వరీ 16-6పాయింట్ల తేడాతో అలెగ్జాండర్ షిమ్రీ(ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. అంతకుముందు గ్రూప్ స్టేజ్‌లో 407.9పాయింట్లతో ఐశ్వరీ అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతక పోటీకు అర్హత సాధించాడు. లీగ్‌లో 0.3 పాయింట్ల వ్యత్యా సంతో ఆండ్రూస్ కంటే ఆధిక్యతలో నిలిచాడు. 22ఏళ్ల థోమర్ రెండేళ్లుగా దక్షిణ కొరియాలోని ఛాంగ్‌వాన్‌లో శిక్షణ పొందుతున్నాడు. పురుషుల ఎయిర్ రైఫిల్‌లో రుద్రాక్ష పాటిల్, మిక్స్‌డ్ ఎయిర్ రైఫిల్‌లో భారత్‌కు స్వర్ణాలు దక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పోటీల్లో భారత్‌కు స్వర్ణాల సంఖ్య నాలుగుకు పెరిగింది.










