మేఘాంశ్ శ్రీహరి, రియా సచ్‌దేవ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు జి. భవానీ శంకర్ దర్శకత్వంలో A2 పిక్చర్స్ బ్యానర్ పై సంధ్యా రాణి, స్వరూప రాణి నిర్మిస్తున్న చిత్రం 'మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా ?' ఈ రోజు ఈ చిత్రంప్రారంభోత్సవ కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. హీరో మంచు మనోజ్ క్లాప్ కొట్టగా, చోటా కె నాయుడు కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు బాబీ కొల్లి గౌరవ దర్శకత్వం వహించారు. మంచు మనోజ్, బాబీ కొల్లి , చోటా కె నాయుడు టైటిల్ పోస్టర్ లాంచ్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్ర యూనిట్ కు శుభాశిస్సులు అందించారు. ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. సి . రామ్ ప్రసాద్ కెమరామెన్ గా పని చేస్తుండగా.. స్టార్ కంపోజర్ గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎంఆర్ వర్మ ఎడిటర్ కాగ, రఘు కులకర్ణి ఆర్ట్ డైరెక్టర్. పోసాని కష్ణ మురళి, సునీల్, హర్ష వర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు సుదర్శన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మూవీ లాంచింగ్ ఈవెంట్ లో హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ.. ప్రారంభోత్సవ వేడుకకి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన మంత్రి తలసాని గారికి, మనోజ్ అన్నకి, బాబీ అన్నకి, చోటా గారికి కతజ్ఞతలు. దర్శకుడిని నమ్మి ఈ సినిమా చేశాను. మా నిర్మాత చాలా గొప్ప సపోర్ట్ ఇచ్చారు. గోపిసుందర్, రామ్ ప్రసాద్ గారు లాంటి బెస్ట్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేయడం ఆనందంగా వుంది. మమ్మల్ని నమ్మి ఇంత భారీగా సినిమాని నిర్మిస్తున్న నిర్మాతకు మరోసారి కృతజ్ఞతలు'' తెలిపారు.











