పవన్ కళ్యాణ్ నటిస్తున్న సుజిత్ తెరకెక్కిస్తోన్న 'ఓజీ' చిత్రం తాజాగా మూడో షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నదని మేకర్స్ వెల్లడించారు. ఈ షూట్‌తో 50 శాతం షూటింగ్ కూడా పూర్తయిందని తెలిపారు. సాహౌ తర్వాత సుజీత్ ఏకంగా ఐదేళ్లు గ్యాప్ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు ఇమ్రాన్ హస్మీ, అర్జున్ దాస్, శ్రియారెడ్డి ఈ చిత్రంలో కీలకపాత్రల్లో కనిపించ నున్నారు.










