May 01,2023 15:14

ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ 16-21, 21-17, 21-19తో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్‌ ఒంగ్‌ యె సిన్‌-తియో ఈ యి (చైనీస్‌ తైపీ) జోడీని ఓడించి స్వర్ణ పతకం గెలుచుకున్నారు. 1965లో పురుషుల సింగిల్స్‌లో దినేశ్‌ ఖన్నా విజేతగా నిలిచి భారత్‌కు తొలిసారి పసిడి పతకం అందించాడు. 58 ఏళ్ల తర్వాత మళ్లీ పసిడి పతకం సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడి సాధించింది.