ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : ఎంజెఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మొదటి సంవత్సర విద్యార్తుల ''ఫ్రెషర్స్ డే'' కార్యక్రమం ఘనంగా నిర్వహించామని కళాశాల చైర్మన్ ఎంపి అవినాష్ కుమార్ రెడ్డి తెలిపారు. స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో నేడు ఈ కార్యక్రమాన్ని ఆనంద ఉత్సవాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్‌తోపాటు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.సుధాకర్ రెడ్డి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ప్లేస్మెంట్లను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చక్కటి సాంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. వివిధ బ్రాంచీల్లో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ద్వారకానాధరెడ్డి, రెడ్డి ఖాసీం, నాగరాజు, నాగార్జున, నరేంద్ర, సుభాషిణి, భార్గవి తదితరులు పాల్గొన్నారు.










