Jan 28,2023 21:30

రాత్రి 7.00గం||ల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
లక్నో: తొలి టి20లో అనూహ్యంగా ఓటమిపాలైన టీమిండియా.. రేపు న్యూజిలాండ్‌తో రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. మూడు టి20ల సిరీస్‌లో 0ా1తో వెనుకబడ్డ భారతజట్టు ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌ రేసులో నిలవనుంది. ఆల్‌రౌండ్‌ హార్దిక్‌ పాండ్య నాయకత్వంలోని టీమిండియా రాంచీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వాషింగ్టన్‌ సుందర్‌ అర్ధసెంచరీకి తోడు సూర్య కుమార్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడటం మినహా భారత బౌలింగ్‌ లైనప్‌ ఆశించినస్థాయిలో లేదు. టాపార్డర్‌, మిడిలార్డర్‌ బ్యాటర్స్‌ రాణిస్తేనే టీమిండియాకు గెలుపొందనుంది. రాంచీ మైదానం బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. తొలుత కివీస్‌కు ఎక్కువగా పరుగులు ఇవ్వడంతోనే లక్ష్య ఛేదనలో టీమిండియాకు కష్టంగా మారింది. టీమిండియా జట్టులో చాలామంది యువకులు ఉండగా.. తొలి మ్యాచ్‌ ఓటముల నుంచి పాఠాలను నేర్చుకొని ముందుకు సాగాల్సి ఉంది.