ప్రజాశక్తి- కలకడ (అన్నమయ్యజిల్లా) : ఆదర్శ పాఠశాల విద్యార్థినికి జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలలో మొదటి బహుమతి లభించింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని పెరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలకడ ఆదర్శ పాఠశాల విద్యార్థిని టి.యస్ అంజుమ్, కలెక్టర్ గిరీషా చేతుల మీదుగా రూ.10వేల చెక్, ప్రశంసాపత్రం అందుకొన్నది. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలలో మొదటి స్థానం సంపాదించి నందుకు గాను ఈ బహుమతి లభించింది. విద్యార్థిని తల్లిదండ్రులు, ప్రిన్సిపల్ మాలంశా వలీ, ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.










