ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం ఆవరోడ్డు రైతునగర్‌లో బాణసంచా పేలి ఒకరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో బాణసంచా తయారుచేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమైంది. ఈ ఘటనలో ఒకరి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వివరాల సేకరిస్తున్నారు.










