Apr 13,2023 21:35

జైపూర్‌: రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌ జరిమానాకు గురయ్యాడు. ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌)లో భాగంగా బుధవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా జరిమానాకు గురయ్యాడు. ఈమేరకు ఐపిఎల్‌ నిర్వాహకులు గురువారం ఓ ప్రకటనలో 'ఐపిఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్ట్‌ ప్రకారం సంజుపై రూ.12లక్షల జరిమానాను విధిస్తున్నట్లు.. అలాగే ఇది తొలి తప్పిదంగా సంజు అంగీకరించినట్లు పేర్కొన్నారు. 12న చెపాక్‌ స్టేడియంలో చెన్నైతో జరిగిన ఉత్కంఠ పోరులో సందీప్‌ శర్మ చివరి బంతికి రాజస్తాన్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే. అలాగే రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు ఈ సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది.