బెంగళూరు: భారత్-ఏ, న్యూజిలాండ్-ఏ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇండియా-ఏ జట్టుకు వికెట్ కీపర్ సంజు శాంసన్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. తొలి మ్యాచ్ బెంగళూరులోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఇరుజట్ల మధ్య జరిగిన మూడు టెస్ట్‌ల అనధికార సిరీస్‌ను భారత్ 1-0తో చేజిక్కించుకొంది. ఇదే వేదికపై జరిగిన మూడో టెస్ట్‌లో భారత్-ఏ జట్టు 113పరుగుల తేడాతో న్యూజిలాండ్-ఏను ఓడించింది సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా డ్రా కాగా.. హుబ్లీ వేదికగా జరిగే రెండో టెస్ట్ నాలుగు రోజుల ఆట అనంతం ఫలితం తేలలేదు. ఇండియా-ఏ లో పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, రజత్ పటీధర్, రాహుల్ త్రిపాఠితోపాటు సంజు శాంసన్‌తో కూడిన భారత-ఏ జట్టు బ్యాటింగ్‌లో బలీయంగా ఉంది. ఆల్‌రౌండర్ తిలక్‌వర్మ, శార్దూల్ ఠాకూర్, రిషీ ధావన్ కూడా బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించగలరు. ఇక న్యూజిలాండ్ జట్టు 2023 ఐసిసి వన్డే ప్రపంచకప్కను దృష్టిలో పెట్టుకొని యువ ఆటగాళ్లకు ప్రాధాన్యతనిచ్చి భారత పర్యటనకు పంపింది.










