Sep 15,2023 08:24

పీలేరు (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేవీపల్లి మండలం మఠంపల్లి వద్ద తుఫాన్‌ వాహనం-లారీ ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడినవారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. తిరుమలకు వచ్చి తిరిగి వెళతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మఅతులంతా కర్నాటక రాష్ట్రం బెళగావి వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.