Nov 22,2022 20:51
  • ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ వెల్లడి

న్యూఢిల్లీ : ఫేస్‌ అథెంటికేషన్‌ (ముఖ గుర్తింపు) ఆధారిత ఇ-కెవైసిని ప్రారంభించినట్లు ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఓ ప్రకటనలో తెలిపింది. దేశ వ్యాప్తంగా 5లక్షలకు పైగా తమ శాఖలు, పాయింట్ల వద్ద ఈ సదుపాయం లభ్యమవుతుందని పేర్కొంది. దీంతో సులభంగా సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతా తెరుచుకునే అవకాశాన్ని కల్పించినట్లు వెల్లడించింది. దీంతో తమ బిజినెస్‌ కరస్పాండెంట్స్‌కు ఇప్పుడు కేవలం ఖాతా తెరిచేందుకు స్మార్ట్‌ఫోన్‌ ఉంటే సరిపోతుందని పేర్కొంది.